Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ క్యాబ్‌ ఓ చిన్న మాల్‌.. ఏది కొన్నా ఉచితమే.. ట్యాక్సీ డ్రైవర్‌ వినూత్న ఆలోచన

This Cab is a Mini Mall Everything is Free Innovative Idea by Taxi Driver
Advertisement
  • బ్యాంకాక్‌ ట్యాక్సీలో ప్రయాణికులకు ఉచిత నిత్యావసరాలు
  • టూత్‌బ్రష్‌లు, సాక్స్‌, బేబీ పౌడర్‌ అందుబాటులో
  • క్యాట్‌ ఫుడ్‌, నీరు, కాఫీ కూడా ఉచితమే
  • డ్రైవర్‌ పదేళ్లుగా ఈ సేవ కొనసాగిస్తున్నట్లు సమాచారం
  • ప్రయాణికులు ఇచ్చే టిప్పులతో కొత్త వస్తువుల కొనుగోలు
Advertisement
సాధారణంగా ట్యాక్సీలో ప్రయాణిస్తే గమ్యస్థానానికి చేరుకోవడమే. కానీ బ్యాంకాక్‌లో ఓ ట్యాక్సీ ఎక్కితే మాత్రం ఓ చిన్న షాపులోకి వెళ్లినట్టే ఉంటుంది. టూత్‌బ్రష్‌లు, సాక్స్‌, బేబీ పౌడర్‌ నుంచి పిల్లుల ఆహారం వరకు ఎన్నో నిత్యావసర వస్తువులు అందులో కనిపిస్తాయి. అంతేకాదు.. వాటిలో అవసరమైనది ఏదైనా ప్రయాణికులు ఉచితంగా తీసుకెళ్లొచ్చు.

ఏళ్లుగా ఇదే సేవ
ఓ డ్రైవర్‌ దాదాపు పదేళ్లుగా తన ట్యాక్సీలో ఈ చిన్నపాటి ఉచిత దుకాణాన్ని నిర్వహిస్తున్నట్లు వైరల్‌ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికులకు అవసరం పడొచ్చనే ఉద్దేశంతో రోజువారీ ఉపయోగించే వస్తువులను కారులో అందుబాటులో ఉంచుతున్నాడు.

కంటెంట్‌ క్రియేటర్లు ఫ్లోరా, నోట్‌ ఈ ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు. టూత్‌బ్రష్‌లు, సాక్స్‌, అద్దం, బేబీ పౌడర్‌, క్యాట్‌ ఫుడ్‌తో పాటు నీరు, కాఫీ కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని గుర్తించారు.

టిప్పులతో మళ్లీ కొనుగోలు
ఈ వస్తువులను ఉచితంగా ఇస్తున్నా డ్రైవర్‌ వాటిని తన సొంత డబ్బుతోనే కొనడం లేదు. ప్రయాణికులు సంతోషంతో ఇచ్చే టిప్పులతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తున్నాడు. దీంతో ఒక ప్రయాణికుడు తీసుకున్న వస్తువు స్థానంలో మరో ప్రయాణికుడి కోసం మళ్లీ సరుకులు చేరుతున్నాయి.

వైరల్‌గా మారిన మంచి ఆలోచన
ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్‌ ఆలోచనను నెటిజన్లు అభినందిస్తున్నారు. సాధారణ ట్యాక్సీ ప్రయాణాన్ని అపురూపమైన అనుభవంగా మార్చాడంటూ ప్రశంసిస్తున్నారు. ఎలాంటి ప్రచారం లేకుండా పదేళ్లుగా కొనసాగుతున్న ఈ సేవ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Advertisement
Advertisement
Bangkok Taxi Driver
Free Essentials Taxi
Thailand Viral Cab
Innovative Taxi Service
Bangkok Mini Mall Taxi
Daily Essentials Free Shop

More Telugu News